LOADING...
Womens T20 WC 2024: మహిళల టీ20 ప్రపంచకప్.. సెమీస్ రేసులో భారత్, కివీస్ సమీకరణాలివే!
మహిళల టీ20 ప్రపంచకప్.. సెమీస్ రేసులో భారత్, కివీస్ సమీకరణాలివే!

Womens T20 WC 2024: మహిళల టీ20 ప్రపంచకప్.. సెమీస్ రేసులో భారత్, కివీస్ సమీకరణాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2024
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల టీ20 ప్రపంచ కప్ లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంది. భారత్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ భారత్‌ సెమీస్ అవకాశాలకు కీలకంగా మారనుంది. న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కూడా ప్రభావం చూపనుంది. రెండు జట్ల సెమీస్‌ చేరుకునే సమీకరణలు కూడా ఆసక్తికరంగా మారాయి. భారత్‌ ముందుగా బ్యాటింగ్ చేస్తే భారత్ కనీసం ఒక్క పరుగు తేడాతో గెలిస్తే, కివీస్ పాక్‌పై 14 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి. భారత్ 10 పరుగుల తేడాతో గెలిస్తే, కివీస్ 4 ఓవర్ల ముందే గెలవాలి. ఈ మార్జిన్లు న్యూజిలాండ్‌ నెట్ రన్ రేట్‌ పెంచేందుకు అవసరం అవుతాయి.

Details

 భారత్ ఛేజింగ్ చేస్తే 

భారత్ ఛేజింగ్ చేయడానికి వస్తే, 20వ ఓవర్లో గెలిస్తే కివీస్ కనీసం 19 పరుగుల తేడాతో గెలవాలి. 6 బంతులు మిగిలి గెలిస్తే, కివీస్‌ కనీసం 26 పరుగుల తేడాతో విజయం సాధించాలి. భారత్, న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేస్తే భారత్ ఒక పరుగు తేడాతో గెలిస్తే, కివీస్‌ పాక్‌పై 17 పరుగుల తేడాతో గెలవాలి. భారత్ 10 పరుగుల తేడాతో గెలిస్తే, కివీస్ కనీసం 27 పరుగుల తేడాతో విజయం సాధించాలి. భారత్, న్యూజిలాండ్ ఛేజింగ్ చేస్తే భారత్ 20 ఓవర్లలో గెలిస్తే, కివీస్ 14 బంతులు మిగిలి ఉండగానే గెలవాలి. భారత్ 6 బంతులు మిగిలి ఉండగానే గెలిస్తే, కివీస్ 20 బంతులు మిగిలి ఉండగానే గెలవాలి.