Page Loader
World Boxing Championships: మహిళల బాక్సింగ్ పోరుకు వేళాయే
మూడోసారి ప్రపంచ బాక్సింగ్‌ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న భారత్‌

World Boxing Championships: మహిళల బాక్సింగ్ పోరుకు వేళాయే

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2023
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్టాత్మక మహిళల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు వేళయైంది. న్యూఢిల్లీలోని కేడి జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్‌కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తియ్యాయి. మూడోసారి ఈ పోటీల నిర్వహణకు భారత్ సిద్ధమైంది. మార్చి 15 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నీలో 65 దేశాల నుంచి దాదాపు 300 మందికి పైగా బాక్సర్లు బరిలోకి దిగనున్నారు. నేడు సాయంత్రం జరిగే ప్రారంభోత్సవానికి కేంద్ర కీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఈవెంట్‌లో భారతదేశ ప్రచారానికి నాయకత్వం వహించనున్నారు.

నిఖత్‌జరీన్

టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్న నిఖత్‌జరీన్

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ దూరదర్శన్ టీవీ, దూరదర్శన్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. క్వార్టర్-ఫైనల్ నుండి మ్యాచ్‌ల ప్రసారం సోనీ నెట్‌వర్క్, సోనీలివ్ యాప్‌లో చూడొచ్చు బంగారు పతక విజేతలకు రూ.10 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన బాక్సర్లు, కాంస్యం సాధించిన వారికి రూ.5 కోట్లు ఇవ్వనున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌(50కి) మరోమారు టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. భారత జట్టు: నీతూఘంఘాస్ (48 కేజీలు), నిఖత్‌జరీన్ (50 కేజీలు), సాక్షిచౌదరి (52 కేజీలు), ప్రీతి (54 కేజీలు), మనీషామౌన్ (57కేజీలు), జైస్మిన్‌లంబోరియా (60కేజీలు), శశిచోప్రా (63కేజీలు), మంజు బాంబోరియా (66 కేజీలు), సనమ్చాచాను (70 కేజీలు), లోవ్లినాబోర్గోహైన్ (75 కేజీలు), సావీటీబూరా (81 కేజీలు) నుపుర్‌షెరాన్ (81+ కేజీలు)