LOADING...
CWC 2025: గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. 
గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌..

CWC 2025: గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2025
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో కొలంబో వేదికగా ముచ్చటగా మూడో మ్యాచ్‌ వాన బారిన పడింది. బుధవారం పాకిస్థాన్,ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను ముందుగా 31 ఓవర్లలో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 31 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. చార్లీ డీన్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది, అయితే మిగతా బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయ్యారు. పాక్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా (4/27) ప్రత్యరి్థని దెబ్బ కొట్టగా, సాదియా ఇక్బాల్‌కు 2 వికెట్లు దక్కాయి.

వివరాలు 

వర్షం ఆగకపోవడంతో  మ్యాచ్‌ను రద్దు చేసిన  అంపైర్లు 

అనంతరం వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్ జట్టు 6.4 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 34 పరుగులు చేసింది. కానీ వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. సులభంగా గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్‌లో పాక్‌ జట్టు విజయాన్ని వర్షం దెబ్బతీసింది. ఈ ఫలితం తర్వాత ప్రతీ జట్టు సరిగ్గా నాలుగేసి మ్యాచ్‌లు ఆడగా... ఇంగ్లండ్: 7 పాయింట్లు ఆస్ట్రేలియా: 7 పాయింట్లు దక్షిణాఫ్రికా: 6 పాయింట్లు భారత్: 4 పాయింట్లు తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో నేడు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది.