LOADING...
Women Athletes India: భారత క్రీడారంగంలో తమదైన ముద్ర వేసిన 'మహిళా మణులు' వీరే..!
భారత క్రీడారంగంలో తమదైన ముద్ర వేసిన 'మహిళా మణులు' వీరే..!

Women Athletes India: భారత క్రీడారంగంలో తమదైన ముద్ర వేసిన 'మహిళా మణులు' వీరే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2025
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతంలో క్రీడలు ప్రధానంగా పురుషాధిక్యతతో కనిపించేవి. కొన్ని అరుదైన ఆటలలో మాత్రమే మహిళలు పాల్గొనేవారు. మరికొన్ని క్రీడలు పూర్తిగా పురుషులకు మాత్రమే పరిమితం అయినట్లుగా భావించబడేవి. కానీ ఆ కాలం మారిపోయింది! ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో విశేష ప్రతిభ చూపిస్తూ, అనేకమంది యువతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, భారతదేశ క్రీడారంగంలో విశేష కీర్తి తెచ్చుకున్న అథ్లెట్ల గురించి తెలుసుకుందాం!

వివరాలు 

పీవీ సింధు 

ఈ తరం యువతకు పరిచయం అక్కర్లేని పేరు పివి.సింధు. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. దేశ విదేశాల్లో జరిగిన అనేక బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచి, బ్యాడ్మింటన్‌లో భారత కీర్తిని రెట్టింపు చేసింది. మిథాలీ రాజ్ జెంటిల్‌మెన్‌ గేమ్‌గా పేరొందిన క్రికెట్‌లో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అనేక రికార్డులను తిరగరాసింది. మహిళా క్రికెట్‌లో ప్రపంచ స్థాయిలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన క్రీడాకారిణిగా (7805 పరుగులు) చరిత్రలో నిలిచింది. భారత మహిళా క్రికెట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన అగ్రగామి అథ్లెట్లలో ఆమె ఒకరు.

వివరాలు 

సానియా మీర్జా 

భారత టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన స్టార్ అథ్లెట్ సానియా మీర్జా, 2003 నుంచి దశాబ్దం పాటు అంతర్జాతీయ టెన్నిస్‌లో భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. తన కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించి, డబుల్స్‌లో వరల్డ్ నెం.1 ర్యాంక్‌ను తన పేరున చేర్చుకుంది. ఇంకా, భారతదేశంలో సింగిల్స్‌లో అత్యధిక రోజులు నెం.1 ర్యాంక్‌లో కొనసాగిన ఏకైక క్రీడాకారిణిగా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మిథాలీ రాజ్ తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టును కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. ఆమె నాయకత్వంలో భారత టీమ్ 2023 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరుకోవడం గర్వించదగ్గ విషయం.

వివరాలు 

క్రీడాకారిణుల విజయగాథలు స్ఫూర్తిదాయకమే! 

మహిళా క్రీడా ప్రపంచాన్ని గర్వపడేలా చేసిన ఎందరో అథ్లెట్లు ఉన్నారు. బాక్సింగ్‌లో మేరీ కోమ్‌, జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్‌, బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, స్ర్పింటింగ్‌లో ద్యూతీ చంద్, వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానూ, రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ - వీరి ప్రతిభ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ క్రీడాకారులు తమ కృషితో దేశానికి గౌరవం తీసుకువచ్చి, యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మహిళా క్రీడాకారిణుల విజయగాథలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే!