Page Loader
మహిళల టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ.. లాస్ట్ ఓవర్లో 4 వికెట్లు పడగొట్టిన షఫాలీ 
మహిళల టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ

మహిళల టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ.. లాస్ట్ ఓవర్లో 4 వికెట్లు పడగొట్టిన షఫాలీ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 11, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన భారత మహిళలు, బౌలింగ్‌లో మెరిశారు. ఫలితంగా బంగ్లాదేశ్‌ను 87 పరుగులకే కట్టడి చేయగలిగారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 95పరుగులే చేసింది. లో స్కోరింగ్ చేసినప్పటికీ టీమిండియా స్పిన్నర్లు సమిష్టిగా రాణించి థ్రిల్లింగ్ విక్టరీని కట్టబెట్టారు. లక్ష్య ఛేదనలో చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. అయితే షఫాలీ వర్మ బౌలింగ్ కు బంగ్లా పులులు బెంబెలిత్తిపోయాయి. ఈ ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌కు సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ మేరకు 96 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా 87 పరుగులకే కుప్పకూలిపోయింది.

DETAILS

 భారత్ కు తొలి బ్రేక్ ఇచ్చిన  మిన్నుమణి 

భారత ఓపెనర్లు షఫాలీ వర్మ (14 బంతుల్లో 19, 4 ఫోర్లు), స్మృతి మంధాన (13 బంతుల్లో 13, 2 ఫోర్లు) 33 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే స్కోరు వద్ద టీమిండియాకు భారీ షాక్ తగిలింది. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత్ 95 పరుగులు చేసింది. భారత్ తరఫున రెండో టీ20 ఆడుతున్న మిన్నుమణి భారత్ కు తొలి బ్రేక్ ఇచ్చింది. రెండో ఓవర్‌లోనే బంగ్లా ఓపెనర్ షమీమా సుల్తానా ను పెవిలియన్ పంపింది. బంగ్లా తరఫున నైగర్ చేసిన పోరాటం ఫలించలేదు. ఫలితంగా దీప్తి వేసిన 19వ ఓవర్లోని ఆఖరి బంతికి వెనుదిరిగింది. దీంతో భారత్ టీ20 సిరీస్‌ను 2‌-0తో కైవసం చేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీమిండియా మహిళల జట్టు విక్టరీ