నేడు బంగ్లాదేశ్‌తో భారత్ మహిళల రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా మహిళల జట్టు మీర్‌పూర్ వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. తొలి టీ20లో అదరగొట్టిన భారత మహిళలు రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కనబర్చాలని ఉవ్విళ్లూరుతున్నారు.
మంగళవారం జరగనున్న రెండో టీ20లో భారత్ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది.
తొలి టీ20లో భారత మహిళల క్రికెట్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చింది. తొలి మ్యాచ్‌లో స్పిన్నర్లు విజృంభించారు. సీనియర్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన దూకుడుతో విజయం నల్లేరుపై నడకే అయ్యింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే దక్కించుకోవాలని హర్మన్ బృందం భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సమం చేయాలని బంగ్లా ఆటగాళ్లు భావిస్తున్నారు.
DETAILS
మహిళల జట్టులో ముగ్గురు తెలుగు క్రీడాకారిణులు
గత మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ రెండో మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని భావిస్తున్నారు.
మరోవైపు బంగ్లా పర్యటనలో భాగంగా భారత జట్టులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు క్రీడాకారిణులు చోటు సంపాదించారు.
గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న మేఘన టీ20 టీమ్ లో స్థానాన్ని నిలుపుకుంది.
మరో తెలుగు ప్లేయర్, పేస్ ఆల్ రౌండర్ అంజలి శర్వాణి వన్డేతో పాటు టీ20 జట్టుకూ ఎంపికయ్యారు. స్పిన్ ఆల్ రౌండర్ బారెడ్డి అనూష కూడా వన్డే, టీ20 ఫార్మాట్లకు టీమిండియాకు సెలెక్ట్ అయ్యింది.
మూడు మ్యాచ్‌ల టీ20 సరీస్ లో భాగంగా గురువారం ( జులై 13న ) ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది.