Ind vs Ban Women's T20: హాఫ్ సెంచరీతో చెలరేగిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-బంగ్లాదేశ్ మహిళల జట్టు మధ్య జరుగుతున్న మొదటి టీ20 మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. డాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 5 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులే చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా ఎక్కువ పరుగులు చేయలేకపోయింది.
బంగ్లా జట్టులో షాతి రాణి(22), శోభన మోస్టరీ(23) షోర్ణా అక్తెర్ (28 నాటౌట్) మినహా మిగతా బ్యాటర్లు తక్కువ పరుగులకే వెనుతిరిగారు.
టీమిండియా బౌలర్లలో పూజా వస్త్రాకర్, మిన్ను మని, షఫాలీ వర్మ తలా ఓ వికెట్ పడగొట్టారు.
Details
భారత జట్టుకు విజయాన్ని అందించిన కెప్టెన్
115 పరుగుల లక్ష్య చేధనకు దిగిన భారత్ 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
భారత్ ఆరంభంలోనే షాఫాలీ వర్మ(0) వికెట్ కోల్పోయింది. అయితే స్మృతి మందాన 38 పరుగులతో రాణించగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో విజృంభించింది.
చివరి వరకూ హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చింది.
బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్ 2 రెండు వికెట్లు తీయగా, మురుఫా అక్తెర్ ఒక వికెట్ పడగొట్టింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జులై 11న ప్రారంభం కానుంది.