Page Loader
నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి!
నేడు బంగ్లాతో తలపడనున్న భారత్

నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 09, 2023
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు 4 నెలల తర్వాత భారత మహిళల జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో నేడు బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమిండియా జట్టు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను బంగ్లాతో ఆడనుంది. నేడు తొలి టీ20 మ్యాచ్ మిర్పూర్ లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనుంది. టీమిండియా జట్టు బంగ్లాదేశ్ జట్టు కన్నా అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ ఉంది. భారత్ నుంచి పలువురు సీనియర్లు ఈ సిరీస్ దూరం కావడంతో యువ క్రీడాకారిణులపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కొత్త వికెట్ కీపర్ ఉమా చెట్రి, రాశి కనోజియా, ఆంధ్ర స్పిన్నర్ బారెడ్డి అనూషలపై అందరి దృష్టి నెలకొంది.

Details

బంగ్లాదేశ్ తలపడే టీమిండియా జట్టు ఇదే

ఇక స్టార్‌ బ్యాటర్లు మందన, షఫాలీ, రోడ్రిగ్స్‌, సమిష్టిగా రాణిస్తే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు. రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ వంటి అనుభవజ్ఞులైన స్పిన్నర్లు కూడా ఈ పర్యటనకు దూరమయ్యారు. అయితే వారి స్థానంలో అనూష బారెడ్డి, రాశీ కనోజియా ఎంపిక చేశారు. తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్‌కీపర్‌), దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, బారెడ్డి అనూష