Page Loader
కాంస్యం గెలిచిన ప్రణయ్.. సెమీఫైనల్లో పోరాడి ఓడిన భారత స్టార్ షట్లర్
కాంస్య పతకం దక్కించుకున్న హెచ్‌ఎస్‌ ప్రణయ్‌

కాంస్యం గెలిచిన ప్రణయ్.. సెమీఫైనల్లో పోరాడి ఓడిన భారత స్టార్ షట్లర్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 27, 2023
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో పోరాడి ఓటమి పాలయ్యాడు. అయినప్పటికీ ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ లో పతకం గెలిచిన ఐదో భారత షట్లర్‌గా ప్రణయ్‌ కీర్తి గడించాడు. ప్రకాశ్‌ పదుకొనె, కిడాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, సాయిప్రణీత్‌లు ప్రణయ్ కంటే ముందు వరుసలో ఉన్నారు. ఓ వైపు సహచరులంతా వెనుదిరినా ప్రణయ్ ఒంటరి పోరాటం చేస్తూ సెమీఫైనల్‌ వరకు చేరుకున్నారు. కానీ తుది సమరానికి అర్హత సాధించలేకపోయారు. క్వార్టర్స్‌లో ప్రపంచ చాంపియన్‌ అక్సెల్సన్‌ను ప్రణయ్‌ ఓడించాడు.సెమీస్‌ ఫైనల్లో మాత్రం వితిద్‌సర్న్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

DETAILS

ఈసారి కూడా ఆ సాంప్రదాయ కొనసాగడం విశేషం

దీంతో భారత్ కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ఈ టోర్నీ నుంచి వెనుదిరిగారు. థాయ్‌లాండ్‌ దేశానికి చెందిన మూడో ర్యాంకర్‌ కునావత్‌ వితిద్‌సర్న్‌ ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ గా ఉన్న ప్రణయ్‌ ను 21-18, 13-21, 14-21తో ఓడించాడు. గంటా 16 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. 31 ఏళ్ల ప్రణయ్‌ తొలి గేమ్‌ను గెలుచుకున్నా, తర్వాత అదే జోరు కనబర్చలేక చతికలపడ్డాడు. ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లు మాత్రమే ఈ ప్రపంచ టోర్నీలో పోటీపడతారు. 2011 నుంచి ఈ మెగా టోర్నీలో భారత్‌ కనీసం ఒక్క పతకమైనా గెలిచేది. ఈసారి కూడా ఈ సంప్రదాయం కొనసాగడం విశేషం.