ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ విజేత నిఖత్ జరీన్‌కు 'థార్' బహుమతి
ఢిల్లీ జరుగుతున్నప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్ ఎన్ గెయన్ థి టామ్‌పై జరీన్ ఆధిపత్యం ప్రదర్శించి 5-0తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ చరిత్రలో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించడం ఇది రెండోసారి. 2022లో 52 కిలోల విభాగంలో నిఖత్ జరీన్ అప్పట్లో వరల్డ్ ఛాంపియన్ నిలిచి సత్తా చాటింది. తాజాగా నిఖత్ జరీన్‌కు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తమ కారు 'థార్' ను అందించింది. అదే విధంగా ' మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్' అవార్డును గెలుచుకుంది.
నిఖత్ జరీన్‌ను ప్రశంసించిన తెలంగాణ సీఎం
ఎదురనేదే లేకుండా భారత క్రీడా చరిత్రలో నిఖత్ సరికొత్త అధ్యయాన్ని లిఖించిందని ప్రశంసిస్తూ మహీంద్రా ఆటోమోటివ్ ట్వీట్ చేసింది. ఆమె అద్భుతమైన ఘనతలను సాధించినందుకు కొత్త థార్ కారును అందిస్తున్నామని, మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్‌గా నిలిచిన ఆమెకు అభినందనలని తెలిపింది. ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకంతో పాటు రూ.82 లక్షల నగదు బహుమతి కూడా నిఖత్ జరీన్ గెలుచుకుంది. స్వర్ణ పతకం సాధించిన నిఖత్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించిన విషయం తెలిసిందే.