భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు అతృతుగా ఎదురుచూస్తున్నారు. ఐసీపీ వన్డే ప్రపంచ్ కప్ 2023 భారత్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆక్టోబర్, నవంబర్ నెలలో వరల్డ్ కప్ జరిగే అవకాశం ఉంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. 2016 తర్వాత భారత గడ్డపై తొలిసారి దయాదులు తలపడబోతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. క్రికెట్ సర్కిల్ లో ఈ వార్త వైరల్ అవుతోంది. అహ్మదాబాద్ లోనే ఇండియా, పాక్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం
అక్టోబర్ 7న ఇండియా-పాక్ మ్యాచ్
ప్రస్తుతం ఐపీఎల్ ముగిసిన వెంటనే వరల్డ్ కప్ షెడ్యుల్ ను బీసీసీఐ ఆనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్, నాగ్‌పూర్, బెంగళూరు, త్రివేండ్రం, ముంబై, ఢిల్లీ, లక్నో, గువాహటి, కోల్‌కతా, రాజ్‌కోట్, ఇండోర్, ధర్మశాలల్లో వరల్డ్ కప్ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఇందులో ఏడు వేదికల్లో మాత్రమే ఇండియా మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 7న టీమిండియా, పాకిస్థాన్ తలపడే ఛాన్స్ ఉంది.