Page Loader
వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లోకి తొలిసారిగా ప్రవేశించిన వరల్డ్ నెంబర్ 1 ఇగా స్విటెక్
తొలిసారిగా ప్రవేశించిన వరల్డ్ నెంబర్ 1 ఇగా స్విటెక్

వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లోకి తొలిసారిగా ప్రవేశించిన వరల్డ్ నెంబర్ 1 ఇగా స్విటెక్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 10, 2023
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

వింబుల్డన్‌ 2023లో మహిళల సింగిల్స్ వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్విటెక్ క్వార్టర్ ఫైనల్లోకి తొలిసారిగా ప్రవేశించింది. ఈ మేరకు రౌండ్ 16లో బెలిండా బెన్సిక్‌ను ఓడించింది. తొలి సెట్‌ను 7-6తో కైవసం చేసుకునేందుకు పోరాడిన బెన్సిక్, రెండో సెట్‌లో ప్రారంభంలోనే బ్రేక్‌ పడి వెనుదిరింది. తర్వాత టై బ్రేకర్‌లో స్విటెక్ మూడో సెట్‌లో 6-3 తేడాతో విజయం సాధించింది.ఈ సీజన్‌లో బెన్సిక్ ఇప్పటికే ఎనిమిదో ఓటమిని చవిచూసింది. 2023 డబ్ల్యూటీఏ పర్యటనలో ఆమె 22-8తో గెలుపు ఓటమి రికార్డ్ కలిగి ఉంది.వింబుల్డన్‌లో బెన్సిక్ 14-8తో గెలుపు ఓటమి రికార్డును కలిగి ఉన్నా ఇంకా క్వార్టర్స్ చేరలేదు. అయితే ఇద్దరి క్రీడాకారిణుల మధ్య పోరులో బెన్సిక్‌ పై స్విటెక్ 3-1 ఆధిక్యంలో ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్వార్టర్ పోరులోకి దూసుకెళ్లిన ప్రపంచ నెంబర్ 1 ఇగా స్విటెక్