
Eng Vs SA: వన్డే చరిత్రలోనే చెత్త రికార్డు.. సౌతాఫ్రికా 342 పరుగుల తేడాతో ఓటమి!
ఈ వార్తాకథనం ఏంటి
సౌతాఫ్రికా వన్డే క్రికెట్‌లో పరమ చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. 415 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా కేవలం 72 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఏకంగా 342 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అత్యధిక తేడాతో నమోదైన పరాజయం. గతంలో భారత్‌తో జరిగిన వన్డేలో శ్రీలంక 317 పరుగుల తేడాతో ఓడింది. ఆ రికార్డే ఇప్పటివరకు అతిపెద్ద ఓటమిగా నిలిచింది. అయితే తాజాగా దాన్ని అధిగమిస్తూ సౌతాఫ్రికా కొత్త రికార్డును సృష్టించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం సౌతాంప్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.
Details
భారీ స్కోరు సాధించిన సౌతాఫ్రికా
టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్, జాకోబ్ బేతెల్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. రూట్ 96 బంతుల్లో 100 పరుగులు చేయగా, అందులో 6 ఫోర్లు ఉన్నాయి. బేతెల్ 82 బంతుల్లో 110 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. జేమీ స్మిత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. చివర్లో జోస్ బట్లర్ (62), విల్ జాక్స్ (19) వేగంగా రన్స్ జోడించడంతో ఇంగ్లండ్ స్కోరు 414 పరుగులకు చేరింది.
Details
ఇద్దరు ఆటగాళ్లతో డకౌట్
తరువాత 415 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ప్రారంభం నుంచే తడబడింది. ఆ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. ఒక ఆటగాడు ఆబ్సెంట్ హర్ట్‌గా నిలిచాడు. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగలిగారు. టాప్ స్కోరర్‌గా బాష్ కేవలం 20 పరుగులే చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ 3 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. వీరి ధాటికి సౌతాఫ్రికా 72 పరుగులకే ఆలౌటైంది.