
Prasidh Krishna: టెస్ట్ చరిత్రలో చెత్త రికార్డు.. ప్రసిద్ధ్ కృష్ణపై నెటిజన్లు ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ పేలవ రికార్డు నమోదు చేశాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత అధిక ఎకానమీ రేటుతో బౌలింగ్ చేసిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ ప్రదర్శన తర్వాత అతడి కెరీర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది అతని చివరి టెస్ట్ కావొచ్చు అంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించడంతో తొలుత టీమిండియా ఆధిక్యంలో ఉన్నా.. ప్రస్తుతం ఓటమి అంచున నిలిచినట్టుగా కనిపిస్తోంది. తొలుత 84 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు, ఆ తర్వాత మాత్రం ఇంగ్లండ్ బ్యాటర్ల దెబ్బకు కంగుతిన్నారు.
Details
ఒక ఓవర్లో 23 పరుగులిచ్చిన ప్రసిద్ధ
ముఖ్యంగా హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్‌లు క్రీజులోకి వచ్చాక ప్రసిద్ధ్ కృష్ణ పూర్తిగా అదుపుతప్పినట్టు కనిపించాడు. ఓ ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు ఇచ్చేశాడు. టెస్ట్ మ్యాచ్‌లో ఓవర్‌కు 5.5 రన్స్ ఇవ్వడం అంటేనే ప్రమాదమే, కానీ టాప్ లెవెల్‌లో ఇలా పర్ఫామ్ చేయడం జట్టుకు గండికావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. దీంతో ఈ టెస్టు సిరీస్‌లో అతడికి ఇది చివరి మ్యాచ్ కావచ్చన్న చర్చ మొదలైంది. మూడో టెస్ట్‌కి అతనికి స్థానం కల్పించాలా వద్దా అన్నదానిపై బీసీసీఐ కంగారు పడేలా తయారైంది. టెస్టుల్లో ఇలా అధిక ఎకానమీ రేట్‌తో చతికిలపడిన బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ పేరు చరిత్రలో చెత్తగా ముద్రపడటం దురదృష్టకరం.