WPL 2024 auction: డబ్ల్యూపీఎల్‌లో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2024 కోసం శనివారం మినీవేలం నిర్వహించిన విషయం తెలిసిందే. మినీ వేలంలో ప్లేయర్ల కోసం ప్రాంచైజీలు ఎగబడ్డారు. ఈ క్రమంలో మినీ వేలంలో భారీ ధరకు అమ్ముడైన టాప్ -5 ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1.ఫోబ్ లిచ్‌ఫీల్డ్-రూ.1 కోటి (గుజరాత్ జెయింట్స్) ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.1కోటికి దక్కించుకుంది. 20ఏళ్ల లిచ్‌ఫీల్డ్‌కు అంతర్జాతీయ లీగుల్లో మంచి రికార్డు ఉంది. మహిళల బిగ్ బాష్ లీగ్ 2023లో కూడా 28.09సగటుతో 309పరుగులు చేసింది. 2.షబ్నిమ్ ఇస్మాయిల్-రూ. 1.20కోట్లు (ముంబై ఇండియన్స్) ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్‌ను రూ.1.2కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
3. బృందా దినేష్ - రూ. 1.30 కోట్లు (యూపీ వారియర్జ్)
అన్‌క్యాప్డ్ భారత బ్యాటర్ బృందా దినేష్‌ను యూపీ వారియర్ రూ.1.3 కోట్లకు దక్కించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సీనియర్ మహిళల వన్డే ట్రోఫీలో కర్ణాటకను ఫైనల్‌కు చేర్చడంలో బృందా దినేష్ కీలక పాత్ర పోషించింది. 4.అన్నాబెల్ సదర్లాండ్-రూ. 2 కోట్లు (దిల్లీ క్యాపిటల్స్) ఆస్ట్రేలియన్ యువ ఆల్ రౌండర్ అనాబెల్ సదర్లాండ్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ.2కోట్లకు దక్కించుకుంది. ఫిబ్రవరి 2020లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సదర్లాండ్ గత సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. 5.కాశ్వీ గౌతమ్-రూ. 2 కోట్లు (గుజరాత్ జెయింట్స్) భారత అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ కాశ్వీ గౌతమ్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.2కోట్లకు కొన్నది. ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 గెలిచిన భారత U-23 జట్టులో కాష్వీ సభ్యురాలు