Page Loader
WPL: మహిళలందరికీ ఉచిత ప్రవేశం.. బీసీసీఐ బంపరాఫర్
మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఉచిత ప్రవేశం

WPL: మహిళలందరికీ ఉచిత ప్రవేశం.. బీసీసీఐ బంపరాఫర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2023
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బీసీసీఐ బంపరాఫర్ ప్రకటించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా మార్చి 8 నాటి మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించే అరుదైన అవకాశాన్ని కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరగనుంది. మహిళా దినోత్సవ కానుకగా ఈ ఆసక్తికర పోరును నేరుగా చూసేందుకు నిర్వాహకులు వీలు కల్పించారు. ఆర్సీబీ, ముంబై మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. మార్చి 8, 2023న టాటా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌ జెయింట్స్‌, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్‌ వీక్షించేందుకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని WPL ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది.

బెంగళూరు

గెలుపు కోసం ఊవ్విళ్లూరుతున్న బెంగళూరు-గుజరాత్

మహిళా క్రికెటర్లకు సమున్నత గౌరవం కల్పిస్తున్న బీసీసీఐ తీరుకు ఫిదా అయ్యామంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఎల్లీస్ పెర్రీ, స్మృతి మంధాన, సోఫీ డివైన్, రిచా ఘోష్ వంటి స్టార్‌లతో బెంగళూరు జట్టు బలంగా ఉంది. అయితే ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. మహిళా దినోత్సవం రోజున విజయం సాధించాలని బెంగళూరు ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరుగగా.. ముంబై రెండింటిలో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంతవరకు రెండేసి మ్యాచ్‌లు ఆడి రెండింట్లోనూ ఓడిన గుజరాత్‌- ఆర్సీబీ మార్చి 8న గెలుపు కోసం పోటీపడనున్నాయి.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

మహిళలకు 'మహిళా దినోత్సవం కానుక'