Page Loader
Team India: WTC 2025-27 షెడ్యూల్ విడుదల.. భారత్ ఎన్ని మ్యాచులు ఆడనుందంటే?
WTC 2025-27 షెడ్యూల్ విడుదల.. భారత్ ఎన్ని మ్యాచులు ఆడనుందంటే?

Team India: WTC 2025-27 షెడ్యూల్ విడుదల.. భారత్ ఎన్ని మ్యాచులు ఆడనుందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ (ICC) 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. సౌతాఫ్రికా 2023-25 టైటిల్ గెలిచిన కొద్దిసేపటికే ఈ షెడ్యూల్ విడుదలైంది. కొత్త సైకిల్‌లో తొమ్మిది దేశాలు కలిపి మొత్తం 71 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈసైకిల్‌కు శ్రీలంకలోని గాలే వేదికగా జూన్ 17న శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌తో తెరతీయనున్నారు. ఈసారి అత్యధిక టెస్టులు ఆడే జట్లుగా ఆస్ట్రేలియా (22 టెస్టులు), ఇంగ్లాండ్‌ (21 టెస్టులు) నిలవగా, భారత జట్టు 18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. టీమిండియా తన సారి జూన్ 20న ఇంగ్లాండ్‌తో లీడ్స్‌ వేదికగా మొదలుపెట్టనుంది. ఈ సారి భారత జట్టు అధికంగా హోమ్‌ మ్యాచ్‌లు ఆడబోతుండటం గమనార్హం.

Details

టీమిండియా షెడ్యూల్ ప్రకారం

శుభ్‌మన్ గిల్‌ నేతృత్వంలో భారత్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్‌తో 5 టెస్టులు వెస్టిండీస్‌తో 2 టెస్టులు దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు ఆస్ట్రేలియాతో 5 టెస్టులు శ్రీలంకతో 2 టెస్టులు న్యూజిలాండ్‌తో 2 టెస్టులు ఇదిలా ఉండగా గత సైకిల్‌లో భారత్ మూడో స్థానానికి పరిమితమైంది. కానీ ఈ సారి సొంతగడ్డపై ఎక్కువ మ్యాచ్‌లు ఉండటంతో ఫైనల్‌కు చేరే అవకాశాలు బలంగా ఉన్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ కీలకంగా మారనుంది.

Details

పాకిస్థాన్ తో సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ప్రారంభం

ఇక ప్రస్తుత చాంపియన్ సౌతాఫ్రికా అక్టోబరులో పాకిస్తాన్‌తో టెస్ట్ సిరీస్‌తో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. అదే సమయంలో 2026 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు టెస్ట్‌ల సిరీస్‌పై అక్కడి అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మొత్తం టెస్టుల సంఖ్య జట్లవారీగా ఇలా ఉంది ఆస్ట్రేలియా - 22 ఇంగ్లాండ్ - 21 భారతదేశం - 18 న్యూజిలాండ్ - 16 వెస్టిండీస్ - 14 దక్షిణాఫ్రికా - 14 పాకిస్తాన్ - 13 శ్రీలంక - 12 బంగ్లాదేశ్ - 12