తదుపరి వార్తా కథనం

IPL-Yajuvendra Chahal-200 Wickets record: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన యజ్వేంద్ర చాహల్
వ్రాసిన వారు
Stalin
Apr 23, 2024
09:48 am
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ రాయల్స్(Rajastan Royals)లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yajwendra Chahal) సోమవారం నాటి మ్యాచ్ లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ (IPL) లో 200 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. సోమవారం రాత్రి ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాజస్థాన్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో యజ్వేంద్ర చాహల్ 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు . 2013లో ఐపీఎల్ లో ఎంటర్ అయిన చాహల్ కేవలం 153 మ్యాచ్ లోనే 200 వికెట్ల మైలురాయిని చేరుకోవడం విశేషం. ముంబయి ఇండియన్స్ జట్టు బ్యాట్స్ మన్ మహమ్మద్ నబీ ని అవుట్ చేసి 200 వ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
200 వికెట్ల మైలు రాయిని చేరుకున్న యజ్వేంద్ర చాహల్
Behind all the entertainment off the field, there's an IPL GOAT we couldn't be more proud of. Yuzi bhai, we love you. 💗 pic.twitter.com/ubtKslNji4
— Rajasthan Royals (@rajasthanroyals) April 22, 2024