Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌పై యశస్వీ జైస్వాల్ సూపర్ సంచరీ
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆటగాడు యశస్వీ జైస్వాల్ అదరగొడుతున్నాడు. రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 3వ రోజు యశస్వీ జైస్వాల్ తన రెండో సెంచరీని నమోదు చేసుకున్నాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీతో జైస్వాల్ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో జైస్వాల్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా అతడికిది మూడో టెస్టు శతకం. మూడో టెస్టు రెండో ఇన్నింగ్‌ను రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్‌ను ప్రారంభించిన జైస్వాల్.. మొదటి నుంచి ధాటిగా ఆడాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా, శుభ్‌మన్ గిల్‌తో ఫొర్లు, సిక్సులతో చెలరేగిపోయాడు.
జైస్వాల్ రిటైర్డ్ హర్ట్
యశస్వీ జైస్వాల్ తన సూపర్ సెంచరీ చేసిన తర్వాత వెన్నునొప్పి కారణంగా రిటైర్ అయ్యాడు. 104 పరుగుల వద్ద జైస్వాల్ మైదానాన్ని వీడాడు. తన కెరీర్‌లో ఏడో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఈ యువ ఆటగాడు 62.58 సగటుతో 751 పరుగులకు చేరుకున్నాడు. జైస్వాల్ తన తొలి సెంచరీని వెస్టిండీస్‌పై చేశాడు. అరంగేట్రంలో 171 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఇదిలా ఉండగా.. మూడో టెస్టులో సెంచరీ చేయడం ద్వారా తన ఫస్ట్ క్రికెట్‌లో జైస్వాల్ 2,500 టెస్ట్ పరుగులు (2,596) దాటాడు.