సెంచరీలు బాదిన కోహ్లీ, గిల్ కన్నా.. అతడే ఐపీఎల్లో బెస్ట్ ప్లేయర్ : డివిలియర్స్
ఐపీఎల్ 2023 ముగియనున్న నేపథ్యంలో ఆర్సీబీ మాజీ ఆటగాడు డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ 2023లో బెస్ట్ ప్లేయర్ ఎవరు? మూడు సెంచరీలు బాదిన శుభ్‌మాన్ గిల్, లేదంటే రెండు బాదిన విరాట్ కోహ్లీనా? లేదంటే ఓకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన రింకూ సింగా? అయితే డివిలియర్స్ మాత్రం ఐపీఎల్లో వీరికన్నా బెస్ట్ ప్లేయర్ ఉన్నాడంటూ తాజాగా కామెంట్స్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వీ జైస్వాల్ ఈ ఐపీఎల్ లో అందరి దృష్టిని ఆకర్షించాడని, కోహ్లీ, గిల్ కన్నా కంటే ముందు స్థానంలో జైస్వాల్ ఉంటాడని ఏబీ స్పష్టం చేశాడు. ఈ యువ బ్యాటర్ లో ఐపీఎల్ లో అద్భుతంగా రాణించినా ఫ్లేఆఫ్స్ కు అర్హత సాధించలేకపోయింది.
యశస్వీ జైస్వాల్ అన్ని షాట్లను ఆడగలడు
ఈ సీజన్లో 14 మ్యాచులు ఆడిన జైస్వాల్ 48 సగటుతో 625 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలున్నాయి. తన వరకు యశస్వీ జైస్వాల్ అన్ని షాట్లను ఆడగలడని, ముఖ్యంగా క్రీజులో ఎంతో సహనంతో కనిపిస్తాడని, అతను గొప్ప ప్లేయర్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినా రాజస్థాన్ రాయల్స్ మాత్రం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. గతేడాది టాప్ ఫామ్‌లో కనిపించినా కనిపించినా జోస్ బట్లర్ ఈ ఐపీఎల్‌లో ఏకంగా ఐదుసార్లు డకౌటయ్యాడు.