Yuzvendra Chahal-Dhanashree: 'ఔను.. మేం విడిపోయాం' - చాహల్, ధనశ్రీ వివాహ బంధానికి ముగింపు!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ మధ్య నెలకొన్న విడాకుల పుకార్లకు ఇక ఫుల్‌స్టాప్ పడింది. వారి మధ్య చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వారిద్దరూ అధికారికంగా విడిపోయారు.
నిన్న ఉదయం 11 గంటలకు ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు హాజరైన చాహల్, ధనశ్రీ, న్యాయమూర్తి ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ సెషన్‌లో పాల్గొన్నారు.
45 నిమిషాల పాటు జరిగిన కౌన్సెలింగ్ అనంతరం, తామిద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని స్పష్టం చేశారు.
18 నెలలుగా వేర్వేరుగా ఉన్నామని, వారి మధ్య అభిప్రాయ భేదాలే ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించారు.
Details
ధనశ్రీ భావోద్వేగ పోస్టు
విచారణ అనంతరం న్యాయమూర్తి సాయంత్రం 4:30 గంటలకు అధికారికంగా విడాకులను మంజూరు చేశారు. విడాకుల అనంతరం ధనశ్రీ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టింది.
'మన జీవితంలో ఎదురయ్యే బాధలు, పరీక్షలు కొన్నాళ్ల తర్వాత దేవుడి ఆశీర్వాదాలుగా మారతాయని, మీరు ఈ రోజు ఏదైనా విషయంలో ఒత్తిడి, ఆందోళన అనుభవిస్తే, మరో అవకాశం మీకుంటుందని పేర్కొంది.
దేవుడిపై విశ్వాసం ఉంచితే, అది మీకు మంచే చేస్తుందని ధనశ్రీ పేర్కొంది. ఈ మెసేజ్‌కు 'ఒత్తిడి నుంచి ఆశీర్వాదం వరకు' అనే క్యాప్షన్ జత చేసింది.