Page Loader
Hyundai Exter : హ్యుందాయ్​ ఎక్స్​టర్ కొనాలంటే ఏడాది వెయిట్ చేయాల్సిందే!
హ్యుందాయ్​ ఎక్స్​టర్ కొనాలంటే ఏడాది వెయిట్ చేయాల్సిందే!

Hyundai Exter : హ్యుందాయ్​ ఎక్స్​టర్ కొనాలంటే ఏడాది వెయిట్ చేయాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2023
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు రోజు రోజుకూ ఆదరణ పెరుగతోంది. ఎస్‌యూవీ కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బడా కంపెనీల ఎస్‌యూవీ వివిధ మోడల్స్ లో లాంచ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కి మార్కెట్లోకి విపరీతమైన డిమాండ్ లభిస్తోంది. ఈ మోడల్‌లోని పలు వేరియంట్స్‌కు ఇప్పటికే 1 ఏడాది వెయిటింగ్ పీరియడ్ కూడా నడుస్తుండడం విశేషం. ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో మొత్తం 7 వేరియంట్లు ఉన్నాయి. ఎస్​, ఎస్​(ఓ), ఎస్​ఎక్స్​(ఓ) కనెక్ట్​, ఎస్​ఎక్స్​(ఓ) ఏఎంటీ, ఎస్​ఎక్స్​(ఓ) వేరియంట్ ల డెలవరీలకు 8 నెలల సమయం పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఏడాది వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Details

హ్యుందాయ్  ఎక్స్‌టర్ లో అధునాతన ఫీచర్లు

హ్యుందాయ్ ఎక్స్‌టర్ కేబిన్ లో సెమీ లెథరేట్ అప్ హోలిస్ట్రీ, ఎక్స్​టర్​ లెటర్స్​ ఉండే హెడ్​రెస్ట్​లు, 3 స్పోక్​ మల్టీపంక్షనల్​ స్టీరింగ్​ వీల్​ వంటివి రానున్నాయి. డాష్​కామ్​, డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లే, 8 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. స్టార్మ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వాయిస్ అసిస్ట్‌‌తో పనిచేయనుంది. ఇక ఈ ఎస్‌యూవీ ఎక్స్ షో రూం ధర రూ.8 లక్షల నుంచి 9.6లక్షల మధ్యలో ఉండనుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు తమ సమీపంలోని హ్యుందాయ్​ షోరూమ్​కు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.