బుల్లి బహుబలి.. 8 ఏళ్ల వయస్సులోనే రికార్డులను సృష్టించింది
హర్యానాలోని పంచుకుల ప్రాంతానికి చెందిన అర్షియా గోస్వామి అనే ఎనిమిదేళ్ల బాలిక రికార్డులను సృష్టించింది. వెయిట్ లిఫ్టింగ్ లో అంచనాలకు మించి రాణిస్తోంది. ఆరేళ్ల వయస్సులోనే 45 కిలోల బరువును ఎత్తి గతంలో అందరిని అశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా ఎనిమిదేళ్ల వయస్సులోనే 60కిలోల బరువును ఎత్తి ఔరా అనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఎనిమిదేళ్ల బాలిక అంటే తోటి పిల్లలతో ఆడుకునే వయస్సు అని చెప్పొచ్చు. అలాంటింది వెయిట్ లిఫ్టింగ్‌లో రాణించి బుల్లి బహుబలిని తలిపించింది. మొదట్లో ఒలింపిక్ విజేత మీరాబాయి చాను నుండి తాను ప్రేరణ పొందినట్లు ఆర్షియా వీడియోలో పేర్కొంది.
బంగారు పతకం సాధించడమే తన కల : ఆర్షియా
మొదట ఆరు సంవత్సరాల వయస్సులో 45 కిలోల బరువును ఎత్తి రాష్ట్ర స్థాయిలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ టోర్నిలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆనాటి నుండి అలవోకగా బరువులు ఎత్తి అందరి చేత శబాష్ అనిపించుకుంటోంది. తనకు వెయిట్ లిఫ్టింగ్ అంటే చాలా ఇష్టమని, దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా ఈ రికార్డును సృష్టించినందుకు చాలా ఆనందంగా ఉందని భవిష్యత్తులో ఇండియాకు బంగారు పతకం సాధించాలనుకుంటున్నానని, అదే తన ధ్యేయమని ఆర్షియా పేర్కొంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి