యువరాజ్ ఆరు సిక్సర్లుపై స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర కామెంట్స్
టీ20 ప్రపంచ కప్ 2007లో టీమిండియా బ్యాటర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఇన్నింగ్స్ ఎప్పటికీ అభిమానులకు గుర్తుండిపోతుది. అప్పట్లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతులను యువరాజ్ సింగ్ సిక్సర్లగా మలిచి ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తాజాగా స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సిక్సర్ల విషయంపై స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. తన కెరీర్‌లో అదొక కాల రాత్రి అని, అలా జరిగి ఉండకూడదని చాలా సార్లు కోరుకున్నానని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి కసితో బౌలింగ్ చేయించాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ తరుపున అన్ని ఫార్మాట్లో కలిపి 845 వికెట్లు తీసిన బ్రాడ్
యువరాజ్ ఇన్నింగ్స్ వల్ల క్రికెట్‌లో తనను తాను పోటీదారునిగా మార్చుకున్నానని చెప్పాడు. అది తాను ముందుకెళ్లేందుకు సహాయపడిందని బ్రాడ్ పేర్కొన్నాడు. ప్రతి ఆటగాడు తన కెరీర్‌లో హెచ్చు తగ్గులను ఎదుర్కొంటాడని, ఒకప్పుడు పేలవమైన ప్రదర్శన చేసినా, అది భవిష్యత్తు మ్యాచులపై ప్రభావం చూపనివ్వకుండా నిలబడ్డానని, 15 సంవత్సరాలుగా క్రికెట్‌లో అద్భుతంగా స్టోక్స్ రాణిస్తున్నాడని పేర్కొన్నారు. ఇంగ్లండ్ తరుపున 121 వన్డేలు, 56 టీ20లు, 166 టెస్టులు ఆడిన బ్రాడ్, ఇప్పటివరకూ అన్ని ఫార్మాట్లో కలిపి 845 వికెట్లను తీశాడు.