
PBKS vs MI : ముంబైతో కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు గట్టి షాక్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటికే నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
అయితే టాప్-2 స్థానాల్లో ఏ జట్లు నిలవబోతున్నాయో ఇప్పటికీ స్పష్టత రాలేదు.
గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు టాప్-2 ర్యాంకుల కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ ఓడిపోవడంతో ఈ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
ఇక సోమవారం జైపూర్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య తలపడనున్న మ్యాచ్ చాలా కీలకంగా మారింది.
వివరాలు
పంజాబ్, ముంబై ఇండియన్స్ పరిస్థితి దాదాపు ఒకటే..
ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే, ఆ జట్టు 19 పాయింట్లతో టాప్-2లో స్థానం పొందే అవకాశాన్ని దక్కించుకుంటుంది.
కానీ ఓటమి పాలైతే మాత్రం టాప్-2 రేసు నుంచి పూర్తిగా బయట పడుతుంది.
ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధిస్తే 18 పాయింట్లు సాధించి టాప్-2లోకి ప్రవేశించే అవకాశముంది.
గుజరాత్ నెట్ రన్‌రేట్ (+0.254) కన్నా ముంబై నెట్ రన్‌రేట్ (+1.292) మెరుగ్గా ఉండడం ముంబైకు లాభంగా నిలుస్తుంది.
అయితే ముంబై ఓడితే మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుని ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాల్సి వస్తుంది.
ఈ మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
వివరాలు
మణికట్టు గాయంతో చాహల్
జట్టులో కీలక బౌలర్ అయిన యుజ్వేంద్ర చాహల్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.
జైపూర్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడ్డ సమయంలో కూడా చాహల్ జట్టులో లేకపోవడం గమనార్హం.
ESPNCricinfo వెల్లడించిన వివరాల ప్రకారం, చాహల్ మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు.
ప్లేఆఫ్స్‌కు ఇప్పటికే అర్హత సాధించిన నేపథ్యంలో అతడి ఫిట్‌నెస్ విషయంలో జట్టు యాజమాన్యం ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావిస్తోంది.
ప్లేఆఫ్స్ ప్రారంభానికి ముందే చాహల్ పూర్తిగా కోలుకుంటాడని జట్టు బలంగా నమ్ముతోంది.
చాహల్ ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉంటాడన్న నమ్మకంతో ఉన్నట్లు అదే నివేదిక తెలిపింది.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అతడి స్థానంలో కర్ణాటకకు చెందిన స్పిన్నర్ ప్రవీణ్ దూబేకి అవకాశం ఇచ్చారు.