ఐర్లాండ్‌తో సిరీస్‌పై కన్నేసిన జింబాబ్వే
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపటి నుంచి ఐర్లాండ్, జింబాబ్వే మధ్య ప్రారంభం కానుంది. ఐర్లాండ్‌కు అతిథ్యమివ్వడానికి జింబాబ్వే సిద్ధమైంది. ఇప్పటికే టీ 20 లీగ్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న జింబాబ్వే జట్టు ఆత్మ విశ్వాసంలో ఉంది. ఎలాగైనా ఐర్లాండ్ పై నెగ్గి ఈ సిరీస్‌ను సాధించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఐర్లాండ్ ఈ సిరీస్‌ను నెగ్గి సత్తా చాటాలని భావిస్తోంది. హరారే మైదానంలో 168 మ్యాచ్ లు జరిగాయి. ఛేజింగ్ జట్లు 86 సార్లు గెలిచాయి. ఈ మైదానంలో బ్యాట్ మెన్స్ పరుగుల చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మ్యాచ్ 12:45 PM ప్రసారం కానుంది. జింబాబ్వే, ఐర్లాండ్ ఇప్పటివరకు 16 వన్డేల్లో తలపడిన విషయం తెలిసిందే.
ఇరు జట్లలోని సభ్యులు..
ఐరిష్ T20I లీగ్ కోల్పోయింది. ఎలాగైన ఈ సిరీస్ గెలుచుకొని జింబాబ్వే పై కసి తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ జట్టులో హ్యారీ టెక్టర్, కర్టిస్ క్యాంఫర్, మార్క్ అడైర్ వంటి ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. వీళ్లు రాణిస్తే ఐరీస్ గెలిచే అవకాశం ఉంటుంది. జింబాబ్వే (ప్రాబబుల్ XI): క్లైవ్‌మాండండే, క్రెయిగ్ఎర్విన్ (కెప్టెన్), ర్యాన్‌బర్ల్, గ్యారీబ్యాలెన్స్, ఇన్నోసెంట్ కైయా, సీన్ విలియమ్స్, వెస్లీ మాధేవెరే, టెండై చటారా, రిచర్డ్ నగరవ, ల్యూక్ జోంగ్వే, డ్ ఎవాన్స్. ఐర్లాండ్ (ప్రాబబుల్ XI): పాల్ స్టిర్లింగ్, ఆండీ బల్బిర్నీ (కెప్టెన్), ఆండీ మెక్‌బ్రైన్, హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, లోర్కాన్‌టక్కర్ (వికెట్-కీపర్), జార్జ్ డాక్రెల్, జాషువా లిటిల్, మార్క్ అడైర్, గ్రాహం హ్యూమ్