జింబాబ్వే విధ్వంసం.. వన్డేలో 408 పరుగులతో 14 ఏళ్ల రికార్డు బద్దలు
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ మ్యాచులో జింబాబ్వే దుమ్ములేపుతోంది. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచుల్లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి రికార్డు సృష్టిస్తోంది.
మొన్న వెస్టిండీస్ జట్టుకు షాకిచ్చిన జింబాబ్వే, నేడు యూఎస్ఏతో జరిగిన మ్యాచులో 408 పరుగులు కొట్టింది.
దీంతో 14 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును జింబాబ్వే జట్టు బద్దలు కొట్టింది. వన్వేల్లో జింబాబ్వేకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఆ జట్టు కెప్టెన్ సీన్ విలియమ్సన్ 101 బంతుల్లో (21 ఫోర్లు, 5 సిక్సర్లు) 174 రన్స్ తో చెలరేగిపోయాడు.
గుంబీ (78), సికిందర్‌రాజా (48), ర్యాన్‌బర్ల్ 47 పరుగులతో రాణించడంతో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. ఇంతకుముందు 2009లో జింబాబ్వే, కెన్యాపై 351 పరుగులు చేసింది.
Details
సూపర్ సిక్స్ కు అర్హత సాధించిన జింబాబ్వే
వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన జింబాబ్వే జోరు మీద ఉంది. ఫైనల్ లీగ్ మ్యాచులో పనికూన అమెరికాపై ఏకంగా నాలుగొందలు బాదింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 86 పరుగులకే 8 వికెట్లను కోల్పోయింది.
ఈ మ్యాచులో జింబాబ్వేకు భారీ విజయం దక్కే అవకాశముంది. ప్రస్తుతం జింబాబ్వే ఆరు పాయింట్లతో గ్రూప్-ఏ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇప్పటికే సూపర్ సిక్స్ కు అర్హత సాధించిన జింబాబ్వే తదుపరి మ్యాచుల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. అదే జరిగితే ఈ సారి వరల్డ్ కప్ కు అర్హత సాధించే అవకాశం ఉంది.