Loading...
Zinedine Zidane: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా జినడిన్ జిదాన్ నియామకం
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా జినడిన్ జిదాన్ నియామకం

Zinedine Zidane: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా జినడిన్ జిదాన్ నియామకం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 28, 2026
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఫుట్‌ బాల్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా, విజయవంతమైన కోచ్‌గా గుర్తింపు పొందిన జినడిన్ జిదాన్‌కు ఫ్రాన్స్ జాతీయ జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించారు. ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, 2030 వరకు జిదాన్ ఫ్రాన్స్ జట్టుకు కోచ్‌గా కొనసాగనున్నట్లు ఫ్రెంచ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. గత 14 సంవత్సరాలుగా ఫ్రాన్స్ జట్టును విజయవంతంగా నడిపించిన డిడియర్ డెషాంప్స్ పదవీకాలం 2026 ఫిఫా ప్రపంచకప్‌తో ముగియడంతో కొత్త కోచ్ ఎంపిక జరిగింది. ఫ్రాన్స్ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌గా డెషాంప్స్ ప్రత్యేక గుర్తింపు పొందాడు.

వివరాలు

ఆటగాడిగా చిరస్మరణీయ కెరీర్..

అతని సారథ్యంలో ఫ్రాన్స్ 2018 ఫిఫా ప్రపంచకప్‌ను కైవసం చేసుకోగా, 2022 ప్రపంచకప్‌లో అర్జెంటీనాతో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.

ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఫ్రాన్స్ మాజీ కెప్టెన్ జినడిన్ జిదాన్ ఆటగాడిగా ఎన్నో చారిత్రక విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

1998 ప్రపంచకప్ ఫైనల్‌లో రెండు హెడర్ గోల్స్ చేసి ఫ్రాన్స్‌కు చరిత్రలో తొలి ప్రపంచకప్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

అనంతరం యూరో-2000 టోర్నీలోనూ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు.

అతని అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా 1998లో ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యున్నత వ్యక్తిగత పురస్కారమైన 'బాలన్ డో' అవార్డును అందుకున్నాడు.

వివరాలు

అతని నాయకత్వంలో 2006 ప్రపంచకప్ ఫైనల్‌కు ఫ్రాన్స్..

2004లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన జిదాన్.. ప్రపంచకప్ అర్హత పోటీల్లో ఫ్రాన్స్ ఇబ్బందులు ఎదుర్కొనడంతో తిరిగి కెప్టెన్‌గా జట్టులో చేరాడు.

అతని నాయకత్వంలో ఫ్రాన్స్ 2006 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది.

అయితే ఇటలీతో జరిగిన ఫైనల్‌లో అదనపు సమయంలో (110వ నిమిషంలో) ప్రత్యర్థి ఆటగాడు మార్కో మటెరాజీ ఛాతీపై తలతో గుద్దడంతో జిదాన్‌కు రెడ్ కార్డు చూపించారు.

ఆ ఘటనతో అతని గొప్ప అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.

ADVERTISEMENT

వివరాలు

కోచ్‌గా అరుదైన విజయాలు..

జినడిన్ జిదాన్‌కు జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఇది తొలి బాధ్యత.

అయినప్పటికీ క్లబ్ ఫుట్‌బాల్‌లో అతను అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరిగా నిలిచాడు.

2016 నుంచి 2021 మధ్య రెండు విడతల్లో రియల్ మాడ్రిడ్‌కు ప్రధాన కోచ్‌గా పనిచేసిన జిదాన్, ఆ జట్టును యూరప్‌లో అగ్రశ్రేణి క్లబ్‌గా తీర్చిదిద్దాడు.

అతని సారథ్యంలో రియల్ మాడ్రిడ్ వరుసగా 2016, 2017, 2018 సంవత్సరాల్లో UEFA ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

వరుసగా మూడు ఛాంపియన్స్ లీగ్ కిరీటాలను సాధించిన తొలి కోచ్‌గా జిదాన్ ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు.

అతని మార్గదర్శకత్వంలో ఫ్రాన్స్ మరోసారి ప్రపంచ ఫుట్‌బాల్‌లో తన పూర్వ వైభవాన్ని తిరిగి అందుకుంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ADVERTISEMENT