Xi Jinping: 100 అడుగుల రెడ్ కార్పెట్.. బి-1 బాంబర్ల ఫ్లైఓవర్.. జిన్‌పింగ్‌కు గ్రాండ్ వెల్‌కమ్..
ఈ వార్తాకథనం ఏంటి
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా గడ్డపై ఆయనకు అరుదైన రీతిలో ఘన స్వాగతం లభించింది. వాషింగ్టన్ సమీపంలోని అమెరికా సైనిక విమానాశ్రయం జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో జిన్‌పింగ్ విమానం దిగగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా స్వయంగా వెళ్లి చైనా అధ్యక్ష దంపతులకు స్వాగతం పలికారు. జిన్‌పింగ్ దంపతుల కోసం అక్కడ 100 అడుగుల పొడవైన రెడ్ కార్పెట్‌ను ఏర్పాటు చేశారు. సైనిక బ్యాండ్ సంగీతం వినిపిస్తుండగా ట్రంప్, జిన్‌పింగ్ పక్కపక్కన నిల్చున్నారు. ఆ సమయంలో ఆకాశంలో రెండు బి-1 బాంబర్లు ఫ్లైఓవర్ నిర్వహించాయి. దీంతో జిన్‌పింగ్‌కు అమెరికా ఇచ్చిన స్వాగతం ప్రత్యేకంగా నిలిచింది.
వివరాలు
మే నెలలో డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన
జిన్‌పింగ్ పర్యటన నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఈ పర్యటనకు ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం జిన్‌పింగ్‌కు ప్రొటోకాల్‌కు మించి కనిపించే రీతిలో ఆతిథ్యం ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. మే నెలలో డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే.
అప్పట్లో ఆయన వెంట అమెరికాకు చెందిన పలువురు సీఈఓలు కూడా ఉన్నారు.
అయితే ఆ పర్యటనలో ట్రంప్‌కు జిన్‌పింగ్‌కు లభించిన తరహాలో ఇలాంటి ఘన స్వాగతం దక్కలేదని ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికా గడ్డపై జిన్‌పింగ్‌కు గ్రాండ్ వెల్‌కమ్..
NOW: President Trump has greeted Chinese President Xi Jinping in Washington, DC with the following:
— Jordan Conradson🇺🇸 (@ConradsonJordan) September 23, 2026
- 100-foot-long red carpet
- Salute Battery
- 21-Person Honor Cordon
- 2 three-person color teams to include the U.S. and Chinese flag
- USAF band playing fanfare and… pic.twitter.com/X7W0oOtc2u