Loading...
Pakistan: పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో లోయ‌లో ప‌డిన వాహ‌నం.. 11 మంది మృతి
పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో లోయ‌లో ప‌డిన వాహ‌నం.. 11మంది మృతి

Pakistan: పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో లోయ‌లో ప‌డిన వాహ‌నం.. 11 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గిల్‌గిత్‌-బాల్టిస్తాన్ ప్రాంతంలోని పర్వత మార్గంలో ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పర్వత ప్రాంతంలోని రహదారిపై వెళ్తున్న సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అది లోయలో పడిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ప్రమాదంలో మరణించిన 11 మంది మృతదేహాలతో పాటు గాయపడిన ముగ్గురు ప్రయాణికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

వివరాలు 

అత్యంత దారుణంగా ఆక్రమిత కశ్మీర్‌లో రహదారి రవాణా వ్యవస్థ

ఈ ఘటనపై స్థానిక మంత్రి అంజద్ హుస్సేన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో రహదారి రవాణా వ్యవస్థ అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అక్కడ రవాణా నిబంధనల అమలు సక్రమంగా లేకపోవడంతో పాటు డ్రైవింగ్ పద్ధతులపైనా తగిన నియంత్రణ ఉండటం లేదు.

దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

గత వారం తూర్పు పాకిస్థాన్‌లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 11 మంది మరణించగా.. మరో 33 మంది గాయపడ్డారు.

ADVERTISEMENT