Page Loader
చైనాలో స్కూల్ జిమ్ పైకప్పు కూలి 11మంది దుర్మరణం 
చైనాలో స్కూల్ జిమ్ పైకప్పు కూలి 11మంది దుర్మరణం

చైనాలో స్కూల్ జిమ్ పైకప్పు కూలి 11మంది దుర్మరణం 

వ్రాసిన వారు Stalin
Jul 24, 2023
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలోని ఓ స్కూల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని కికిహార్ నగరంలో పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11మంది మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కికిహార్ నగరంలోని 34వ మిడిల్ స్కూల్‌లోని జిమ్‌లో 35మంది ఉన్న సమయంలో ఒక్కసారిగా జిమ్ పైకప్పు కూలిపోయింది. దీంతో జిమ్‌లో ఉన్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు పలువురిని బయటుకు తీశారు. 11మంది చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.

చైనా

కొనసాగుతున్న సహాయక చర్యలు

శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాఠశాల వ్యాయామశాలకు ఆనుకుని భవనాన్ని నిర్మిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ భవనంలోని నిర్మాణ కార్మికులు పాఠశాల వ్యాయామశాల పైకప్పు పై పెర్లైట్‌ను ఉంచారు. చైనాలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఆ పెర్లైట్ నీటిని పీల్చుకోవడం ద్వారా బరువు ఎక్కువైన కారణంగానే పైకప్పు కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన అనంతరం భవనాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ అధికారులను అదుపులోకి తీసుకున్నారు.