DR Congo: డీఆర్ కాంగో జైలులో129 మంది మృతి.. 59 మందికి గాయాలు
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలులో ఇటీవల ఖైదీల సంయుక్తంగా జైలు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం తీవ్రంగా విఫలమైంది. ఈ ఘటనలో సుమారు 129 మంది ఖైదీలు మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటీరియర్ మంత్రి షబాని లుకో మంగళవారం ఈ వివరాలను ఎక్స్‌లో వెల్లడించారు. మంటల్లో చిక్కుకొని 24 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. "మకాల జైలు నుంచి ఖైదీలు భారీ స్థాయిలో తప్పించుకోవడానికి ప్రయత్నించారు. జైలు గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగజి పరిస్థితులను నియంత్రించడానికి ప్రయత్నించగా,జరిగిన గొడవలో, కిచెన్‌లో చెలరేగిన మంటల్లో మొత్తం 129మంది మరణించగా..59మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో అడ్మినిస్ట్రేటివ్ భవనం కూడా దెబ్బతింది" అని మంత్రి షబాని లుకో చెప్పారు.
తప్పించుకోవడానికి ప్రయత్నించి మరణించారు
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జైలు అధికారులు ఈ విషయం గురించి మాట్లాడుతూ, "ఖైదీలు జైలులో నుంచి తప్పించుకోలేకపోయారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారు మరణించారు" అని స్పష్టం చేశారు. మరోవైపు, ఖైదీలు తమకు బయట నుండి భారీ కాల్పుల శబ్దాలు వినిపించాయని, పేర్కొన్నట్లు సదరు సంస్థ పేర్కొంది.