Ukraine port: ఉక్రెయిన్ పోర్టులో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు..
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో నల్ల సముద్ర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితుల మధ్య ఉక్రెయిన్‌లోని చోర్నోమోర్స్క్ ఓడరేవులో నిలిచివున్న ఓ కార్గో నౌకలో 13 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయినట్లు 'ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా' (FSUI) వెల్లడించింది. ఎఫ్‌ఎస్‌యూఐ తెలిపిన వివరాల ప్రకారం, 'MV AMIR1' అనే సరకు రవాణా నౌకలో మొత్తం 15 మంది సిబ్బంది ఉండగా, వారిలో 13 మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం చోర్నోమోర్స్క్ పోర్టు పరిసర ప్రాంతాల్లో డ్రోన్, క్షిపణి దాడులు కొనసాగుతుండటంతో నౌకలోని సిబ్బంది తీవ్ర ప్రమాదంలో ఉన్నారని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాలు
కేంద్రానికి విజ్ఞప్తి..
ఈ నేపథ్యంలో చిక్కుకుపోయిన భారతీయ నావికులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఎఫ్‌ఎస్‌యూఐ కోరింది.
అలాగే నౌక యాజమాన్యం, సంబంధిత అధికారులు సమన్వయంతో అత్యవసర చర్యలు చేపట్టి సిబ్బంది భద్రతను నిర్ధారించాలని విజ్ఞప్తి చేసింది.