
united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ చేపట్టిన భీకర దాడుల నేపథ్యంలో గాజా భూభాగంలో పరిస్థితులు పూర్తిగా విషమించిపోయాయి.
సాధారణ ప్రజల జీవన విధానం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. నాలుగు వైపులా గాజా పట్టణాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్, ఇప్పుడు మానవతా సహాయాన్ని కూడా కేవలం పరిమితంగా మాత్రమే అనుమతిస్తోంది.
దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆకలితో విలవిల్లాడుతున్న గాజా జనాభాపై ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పటి తరహాలోనే సహాయం కొనసాగితే, రానున్న 48 గంటల్లో సుమారు 14 వేల మంది చిన్నారులు మరణించే ప్రమాదముందని తీవ్ర హెచ్చరిక చేసింది.
వివరాలు
పాలస్తీనా భూభాగాన్ని నిర్బంధించిన ఇజ్రాయెల్
11 వారాల క్రితం పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ నిర్బంధించింది.
అయితే అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు ఒత్తిడి చేయడంతో, గాజాలోకి పరిమిత స్థాయిలో మానవతా సహాయాన్ని ప్రవేశపెట్టేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది.
అయినప్పటికీ అక్కడి పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. చిన్నారులతో సహా గాజా వాసులకు ఇటీవల గాజా ప్రజలకు కేవలం ఐదు ట్రక్కుల మానవతా సహాయమే చేరినట్లు తెలుస్తోంది.
ఇది వారి అవసరాలకు ఏమాత్రం సరిపోదని, అక్కడ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని ఐరాస ప్రతినిధి టామ్ ప్లేచర్ పేర్కొన్నారు.
వివరాలు
100 ట్రక్కుల మానవతా సహాయాన్ని గాజాలోకి అనుమతించాలి :ఐరాస
''చిన్నారులతో పాటు తల్లులు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.వారు తినేందుకు ఏమీ లేక తీవ్ర స్థితికి చేరుకున్నారు.ఇంకా సహాయం తక్షణమే అవసరం.లేకపోతే మరో రెండు రోజుల్లోనే పదిహెనివేలకు చేరువలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది''అని గంభీర హెచ్చరిక చేశారు.
ఇజ్రాయెల్ మానవతా సాయం విషయంలో తీసుకుంటున్న నిర్లక్ష్య ధోరణిపై బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా దేశాలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశాయి.
గాజాలోకి మానవతా సహాయాన్ని నిరోధిస్తే తాము సంయుక్త చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
తాజగా ఐక్యరాజ్యసమితి కూడా స్పష్టంగా స్పందించింది. పోషకాహారంతో నిండిన 100 ట్రక్కుల మానవతా సహాయాన్ని గాజాలోకి అనుమతించాలని, చిన్నారుల ప్రాణాలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేసింది.