
Bus Falls Into River:పెళ్లి బస్సు నదిలో పడి 14 మంది మృతి.. ప్రాణాలతో బయటపడిన వధువు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే, వధువు మాత్రం ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడింది. గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
సుమారు 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంపు వద్ద అదుపు తప్పి నదిలో పడిపోయింది.
ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకోగా, మరో 10 మందికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
వధువు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, ఆమె ప్రస్తుతం గిల్గిట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నదిలో పడిన పెళ్లి బస్సు
26 dead as bus carrying wedding guests plunges into river in Gilgit-Baltistan's
— ARY NEWS (@ARYNEWSOFFICIAL) November 13, 2024
More details: https://t.co/NLHZmCkRTQ#ARYNew #gligitbaltistan pic.twitter.com/Vbck42Ltc5