LOADING...
 Nobel Prize 2023: మెడిసిన్‌లో కాటలిన్, వీస్‌మాన్‌కు నోబెల్.. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో కీలక పాత్ర 
మెడిసిన్‌లో కాటలిన్, వీస్‌మాన్‌కు నోబెల్.. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో కీలక పాత్ర

 Nobel Prize 2023: మెడిసిన్‌లో కాటలిన్, వీస్‌మాన్‌కు నోబెల్.. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో కీలక పాత్ర 

వ్రాసిన వారు Stalin
Oct 02, 2023
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెడిసిన్‌లో 2023 ఏడాదికి గానూ కాటలిన్ కారికో, డ్రూ వెయిస్‌మన్‌లకు నోబెల్ బహుమతి వరించింది. న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులకు సంబంధించిన వీరి ఆవిష్కరణలకు సంయుక్తంగా కమిటీ ఈ అవార్డు ప్రకటించింది. వీరి ఆవిష్కరణలు కరోనాకు వ్యతిరేకంగా సమర్థవంతమైన mRNA వ్యాక్సిన్‌ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. కాటలిన్ కారికో హంగేరికి చెందిన వారు.. కాగా, వెయిస్‌మన్‌ అమెరికాకు చెందిన వారు. వీరిద్దరూ యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో కలిసి తమ పరిశోధనలు చేసారు. ఈ నేపథ్యంలోనే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను శరీర కణాల్లోకి పంపినప్పుడు.. శరీరంలో ప్రొటీన్‌ ఉత్పత్తిని పెంచుతాయని గుర్తించారు. అంతేకాకుండా, ప్రతిచర్యను అడ్డుకోవడంలోనూ సమర్థవంతంగా పని చేస్తాయని వీరి పరిశోధనలో తెలింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నోబెల్ కమిటీ ట్వీట్