Loading...
Delta flight delays: డెల్టా ఎయిర్‌లైన్స్ కంప్యూటర్ సిస్టమ్‌లో లోపం.. 3,500 విమానాలపై ప్రభావం
డెల్టా ఎయిర్‌లైన్స్ కంప్యూటర్ సిస్టమ్‌లో లోపం.. 3,500 విమానాలపై ప్రభావం

Delta flight delays: డెల్టా ఎయిర్‌లైన్స్ కంప్యూటర్ సిస్టమ్‌లో లోపం.. 3,500 విమానాలపై ప్రభావం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో విమాన ప్రయాణికులకు మరోసారి సాంకేతిక సమస్యలు ఇబ్బందులు సృష్టించాయి. ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్ కంప్యూటర్ వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా దేశవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఆదివారం (నవంబర్ 22) చోటుచేసుకున్న ఈ ఘటనతో అట్లాంటా విమానాశ్రయంలో పరిస్థితి గందరగోళంగా మారింది. న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంతో పాటు మరికొన్ని ఎయిర్‌పోర్టులపైనా దీని ప్రభావం కనిపించింది. ఆరోజు సుమారు 5,000 విమాన సర్వీసులు షెడ్యూల్ చేయగా.. సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 3,500 విమానాల ప్రయాణ ప్రణాళికలు దెబ్బతిన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

వివరాలు 

విమానాల బరువు లెక్కించే వ్యవస్థలో లోపం

డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాల బరువు, సమతుల్యతను లెక్కించే ఆటోమేటెడ్ కంప్యూటర్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది.

విమానం టేకాఫ్ అయ్యే ముందు ప్రయాణికులు, వారి లగేజీ, ఇంధనం, ఇతర సరుకుల మొత్తం బరువును లెక్కించాల్సి ఉంటుంది.

అంతేకాదు.. విమానంలోని వివిధ ప్రాంతాల్లో బరువు ఏ విధంగా పంపిణీ అయిందో కూడా పరిశీలించాలి.

ఈ వివరాల ఆధారంగానే విమానం సరైన సమతుల్యతతో ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తారు.

బరువు, దాని పంపిణీలో తేడాలు ఉంటే విమానం సురక్షితంగా టేకాఫ్ కావడం, గాల్లో స్థిరంగా ప్రయాణించడం కష్టమవుతుంది.

అందుకే ఈ లెక్కలు విమాన ప్రయాణ భద్రతలో అత్యంత కీలకమైనవి.

వివరాలు 

కంప్యూటర్‌కు బదులుగా చేతితో లెక్కలు

ఆటోమేటెడ్ కంప్యూటర్ వ్యవస్థ పనిచేయకపోవడంతో డెల్టా సిబ్బంది ప్రత్యామ్నాయ పద్ధతిని అనుసరించాల్సి వచ్చింది.

విమానాల బరువు, బరువు పంపిణీకి సంబంధించిన వివరాలను కంప్యూటర్ ద్వారా కాకుండా సిబ్బంది చేతితో లెక్కించారు.

ఈ ప్రక్రియకు సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టడంతో విమానాల బయలుదేరే సమయాల్లో జాప్యం ఏర్పడింది.

ముఖ్యంగా అట్లాంటా విమానాశ్రయంలో పరిస్థితి తీవ్రంగా మారింది.

దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అక్కడికి వచ్చే కొన్ని విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది.

దాదాపు గంటపాటు ఈ ఆంక్షలు కొనసాగాయి. అనంతరం గ్రౌండ్ స్టాప్‌ను ఎత్తివేసినప్పటికీ విమానాల ఆలస్యాలు మాత్రం వెంటనే తగ్గలేదు.

ADVERTISEMENT

వివరాలు 

5 వేల విమానాలు షెడ్యూల్.. ప్రయాణికులకు పరిహార ఏర్పాట్లు

ఆదివారం డెల్టా ఎయిర్‌లైన్స్,దాని ప్రాంతీయ భాగస్వామి డెల్టా కనెక్షన్‌కు చెందిన సుమారు 5,000 విమాన సర్వీసులు నడవాల్సి ఉంది.

ఫ్లైట్‌అవేర్ గణాంకాల ప్రకారం.. ఆ రోజు నమోదైన విమానాల ఆలస్యాలు, రద్దుల్లో సుమారు 70శాతం ఈ సాంకేతిక సమస్యతో సంబంధం ఉన్నట్లు డెల్టా వెల్లడించింది.

మిగిలిన విమానాలపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అమెరికా ఈశాన్య ప్రాంతాల్లో విమాన రాకపోకలకు సంబంధించిన సమస్యలు ప్రభావం చూపాయి.

ఈ ఇబ్బందులపై డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.

అసౌకర్యానికి గురైన వారికి అందుబాటులో ఉన్న తదుపరి విమానాల్లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసింది. అవసరమైన వారికి భోజనం, హోటల్ వసతి కల్పించింది.

ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకున్న వారికి టికెట్ ధరను తిరిగి పొందే అవకాశాన్ని కూడా అందించింది.

ADVERTISEMENT

వివరాలు 

10 రోజుల్లోనే మరోసారి సాంకేతిక సమస్య

అమెరికా విమానయాన రంగాన్ని ఇటీవల వరుస సాంకేతిక సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

నవంబర్ 13న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నెట్‌వర్క్‌లో లోపం తలెత్తింది.

దీంతో దేశవ్యాప్తంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఆ ఘటన కారణంగా 18 వేలకుపైగా విమానాలు ఆలస్యమయ్యాయి లేదా వాటి షెడ్యూళ్లలో మార్పులు చోటుచేసుకున్నాయి.

వివరాలు 

10 రోజుల్లోనే మరోసారి సాంకేతిక సమస్య

తాజాగా డెల్టా ఎయిర్‌లైన్స్ కంప్యూటర్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో ప్రయాణికులు మరోసారి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అయితే ఈ రెండు ఘటనలూ వేర్వేరు వ్యవస్థల్లో చోటుచేసుకున్నవేనని అధికారులు స్పష్టం చేశారు.

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సమస్యకు ఎఫ్‌ఏఏ విమాన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

మరోవైపు తమ ఆటోమేటెడ్ కంప్యూటర్ వ్యవస్థ తిరిగి సాధారణంగా పనిచేస్తోందని డెల్టా ప్రకటించింది.

ఈ ఘటన వెనుక సైబర్ దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సంస్థ స్పష్టం చేసింది.

ADVERTISEMENT