Page Loader
303మంది భారతీయ ప్రయాణికులకు ఊరట.. నేడు ఫ్రాన్స్‌ నుంచి వెళ్లేందుకు విమానానికి అనుమతి 
303మంది భారతీయ ప్రయాణికులకు ఊరట.. నేడు ఫ్రాన్స్‌ నుంచి వెళ్లేందుకు విమానానికి అనుమతి

303మంది భారతీయ ప్రయాణికులకు ఊరట.. నేడు ఫ్రాన్స్‌ నుంచి వెళ్లేందుకు విమానానికి అనుమతి 

వ్రాసిన వారు Stalin
Dec 25, 2023
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి 303 మంది భారతీయ ప్రయాణికులతో నికరాగ్వా వెళ్తున్న విమానాన్ని మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నిలిపివేసిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌లోని వెట్రి విమానాశ్రయంలో ఆగిపోయిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత ఆ దేశం నుంచి బయలుదేరడానికి అనుమతి లభించింది. ఈ విమానం డిసెంబర్ 25 ఫ్రాన్స్ నుంచి టేకాఫ్ కావచ్చని అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఆ విమానం ప్రయాణికులను భారత్‌కు తీసుకెళ్తుందా? లేకా నికరాగ్వా తీసుకెళ్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ విమానం సోమవారం నాటికి ముంబై విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఫ్రాన్స్

303 మంది ప్రయాణికులను ప్రశ్నించిన ఫ్రెంచ్ న్యాయమూర్తులు 

'మానవ అక్రమ రవాణా' అనుమానంతో పారిస్‌కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాట్రీ విమానాశ్రయంలో విమానాన్ని ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న 303 మంది భారతీయ ప్రయాణికులను ఆదివారం నలుగురు ఫ్రెంచ్ న్యాయమూర్తులు ప్రశ్నించారు. మానవ అక్రమ రవాణా అనుమానంతో ఈ విచారణ చేప్టటారు. విమానం సోమవారం టేకాఫ్ అయ్యే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధికార వర్గాలు తెలిపాయి. చాలా మంది ప్రయాణీకులు భారతదేశం నుంచి లేదా దాని అసలు గమ్యస్థానమైన నికరాగ్వాకు ఉన్నందున విమానాన్ని వారి ఇప్పుడు ఎక్కడి తీసుకెళ్తారనేది ఉత్కంఠగా మారింది.