Page Loader
Hawaii Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి.. ఇద్దరికీ గాయాలు 
అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి.. ఇద్దరికీ గాయాలు

Hawaii Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి.. ఇద్దరికీ గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2024
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని హవాయి రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో నిందితుడు,ముగ్గురు మహిళలు ఉన్నారు. హొనొలులు పోలీసుల వివరాల ప్రకారం, శనివారం అర్ధరాత్రి వైయానే ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం, పోలీసులు విలేకరులతో సమావేశమై వివరాలను వెల్లడించారు. వైయానే వ్యాలీలోని ఓ ఇంట్లో వేడుక జరుగుతున్న సమయంలో, నిందితుడు మొదట తన వాహనంతో ఆ ఇంటి కార్లను ఢీకొట్టాడు. తర్వాత, వేడుకలో పాల్గొన్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

వివరాలు 

ఇరుగుపొరుగు మధ్య గొడవలే కాల్పులకు కారణం 

దీన్ని చూసి చాలా మంది అక్కడి నుంచి పారిపోయారు. ఇంటివారి యజమాని తన తుపాకీతో నిందితుడిని కాల్చడంతో అతడు అక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొత్తంగా ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు, వారిలో ముగ్గురు అక్కడే మరణించారు, మిగిలిన ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇంటి యజమానిని సెకండ్‌ గ్రేడ్‌ మర్డర్‌ కింద అరెస్ట్ చేశారు. నిందితుడు తన వాహనంలో కొన్ని డ్రమ్ములను ఉంచి, వాటిలో ఇంధనం నింపి, వాటిపై కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇరుగుపొరుగు మధ్య గొడవలే ఈ కాల్పులకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.