Page Loader
Texas: అమెరికాలో కారు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి 
అమెరికాలో కారు ప్రమాదం..

Texas: అమెరికాలో కారు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2024
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలోని రోడ్డు నం. 75పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు, మరొకరు తమిళనాడు వాసి ఉన్నారు. ఈ సంఘటన శుక్రవారం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ వాసులు ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఈ ప్రమాదంలో మృతి చెందినవారిగా గుర్తించారు.

వివరాలు 

5 వాహనాలు ఒకదానినొకటి ఢీకొని.. వాహనానికి మంటలు..

ఈ నలుగురు కార్‌ పూలింగ్ ద్వారా బెన్‌టోన్‌విల్లె ప్రాంతానికి వెళ్లే ప్రయత్నంలో ఒకే వాహనంలో ప్రయాణం చేయగా, వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వారు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకొని, వారు వాహనం నుండి బయటకు రాలేకపోయారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయినందున, కార్ పూలింగ్ యాప్‌లోని వివరాల ఆధారంగా ఈ నాలుగు మృతుల ప్రాథమిక గుర్తింపును చేశారు. ఈ విషాదకర సంఘటనపై వారి స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.