IndiGo Flights: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 400 మంది ఇండిగో ప్రయాణికులు..!
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 13, 2024
09:49 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రయాణించాల్సిన 400 మంది ప్రయాణికులు ఇస్తాంబుల్‌లో చిక్కుకుపోయారు. తుర్కియే నుండి దిల్లీ, ముంబయిల మధ్య రాకపోకలు జరపాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ విమాన రద్దు గురించి ప్రయాణికులకు ముందుగా సమాచారం అందించకపోవడంతో వారు ఇస్తాంబుల్ విమానాశ్రయంలో చిక్కుకుపోయి ఆహారం, వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ అనుభవాలను, ఎదురైన కష్టాలను బాధిత ప్రయాణికులు ఎక్స్ వేదిక ద్వారా పంచుకున్నారు.