నేపాల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం; కూలిన భవనాలు
నేపాల్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేపాల్‌లోని నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్(ఎన్ఈఎంఆర్‌సీ) పేర్కొంది. బజురా జిల్లాలోని బిచియా చుట్టూ భూమి కంపించినట్లు వెల్లడించింది. నేపాల్‌లో ఇటీవల 5.8 తీవ్రతతో భూకంపం సంభవించగా, మూడు ఇళ్లు కూలిపోయినట్లు అధికారులు చెప్పారు. హిమాలి విలేజ్ కౌన్సిల్ ఆఫ్ బజురా, హుమ్లా యొక్క తాజాకోట్ విలేజ్ కౌన్సిల్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్ఈఎంఆర్‌సీ చెప్పింది.
ప్రమాద తీవ్రతను తెలుసుకోవడానికి సమయం పడుతుంది: అధికారులు
భూకంపం సంభవించిన ప్రదేశం మారుమూల ప్రాంతం కావడంతో అక్కడ ఎలాంటి సమాచార వ్యవస్థ లేదని అధికారులు చెప్పారు. దీంతో భూకంపం సంభవించన ప్రాంతాల్లో ప్రమాద తీవ్రతను తెలుసుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు. భూకంపం ధాటికి ఆ ప్రాంతంలో మరికొన్ని ఇళ్లు కూలిపోయినట్లు తెలిసిందని డీఎస్పీ సూర్య తాపా తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మంచు కురుస్తున్నందున ఇతర ప్రాంతాలతో తాము సంబంధాలను ఏర్పరచుకోలేకపోతున్నామని హిమాలి విలేజ్ కౌన్సిల్ చీఫ్ గోవింద బహదూర్ మల్లా చెప్పారు.