
US's Cincinnati: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. సిన్సినాటిలోని వెస్ట్ ఎండ్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
జోన్స్ స్ట్రీట్, వేడ్ స్ట్రీట్ సమీపంలో రాత్రి 9:30గంటలకు కాల్పులు జరిగినట్లు సిన్సినాటి పోలీస్ చీఫ్ థెరిసా థీట్గే వెల్లడించారు. గాయాలపాలైన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కాల్పుల్లో మరణించిన వ్యక్తి వయస్సు, గుర్తింపును అధికారులు ఇంకా వెల్లడించలేదు. గాయపడిన వారిలో ఎక్కువ మంది యువకులు ఉన్నారు.
కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతోందని తీట్గే పేర్కొన్నారు. కాల్పుల వెనుక ఉద్దేశం కూడా తెలియదన్నారు.
జనవరి 9, 2023న సిన్సినాటి సరికొత్త పోలీసు చీఫ్‌గా నియామకమైన తీట్గే ఈ కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐదుగురికి గాయాలు
One person has died and five others were injured after a shooting in Cincinnati, police say. https://t.co/nEO4Oc8O43
— ABC News (@ABC) November 4, 2023