Page Loader
Earthquake: నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు..హడలెత్తిపోయిన ప్రజలు
నేపాల్‌లో భూకంపం..రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు..హడలెత్తిపోయిన ప్రజలు

Earthquake: నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు..హడలెత్తిపోయిన ప్రజలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2025
08:02 am

ఈ వార్తాకథనం ఏంటి

హిమాలయ దేశమైన నేపాల్‌లో భూకంపం సంభవించింది. సింధుపల్‌చోక్‌ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించిందని సమాచారం. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాలను చూస్తే, నేపాల్‌లోని సింధుపల్‌చోక్ జిల్లాలో భైరవకుండ వద్ద భూప్రకంపనలు సంభవించాయి. అక్కడే భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. రిక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు వెల్లడించారు. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

వివరాలు 

నేపాల్‌ భూకంపం ప్రభావం భారతదేశంలో..

ఇంకా, ఈ భూకంప ప్రభావం భారత్‌, చైనా, టిబెట్‌ సరిహద్దుల్లో స్వల్పంగా కనిపించిందని అధికారులు తెలియజేశారు. నేపాల్‌ భూకంపం ప్రభావం భారతదేశంలోని ఉత్తర రాష్ట్రాలపై కూడా పడింది. ముఖ్యంగా బీహార్‌ రాజధాని పాట్నా, పశ్చిమబెంగాల్‌, సిక్కింలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. దీని కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేపాల్‌లో భూకంపం