Page Loader
Japan: జపాన్ తూర్పు తీరానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం
జపాన్ తూర్పు తీరానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం

Japan: జపాన్ తూర్పు తీరానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2024
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌లోని హోన్షు తూర్పు తీరంలో గురువారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం 32 కిమీ (19.88 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. అయితే ప్రాణ,ఆస్తినష్టానికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. జపాన్‌ రాజధాని టోక్యోలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇక, తైవాన్‌ లో బుధవారం ఉదయం నాడు భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం రిక్టర్‌ స్కేలుపై 7.2 తీవ్రతతో సంభవించింది. 25 ఏళ్లలో అతి పెద్ద భూకంపం ఇదే అని స్థానిక అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జపాన్ లో భూకంపం