
Earthquake: బ్రిటీష్ కొలంబియా తీరంలో భూకంపం.. తీవ్రత 6.5గా నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటీష్ కొలంబియా, కెనడా తీర ప్రాంతంలోని ఉత్తర కోస్తాలో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది.
అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం తీవ్రత 6.5 గా నమోదైంది.
బ్రిటీష్ కొలంబియాలోని అతిపెద్ద నగరమైన వాంకోవర్‌కు 1,720 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న హైడా గ్వాయి ద్వీపసమూహంలో భూకంప కేంద్రం ఉన్నట్లు USGS పేర్కొంది.
ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం లేదని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
వివరాలు
రెండు సార్లు భూ ప్రకంపనలు
ఇప్పటివరకు,ఈ ప్రాంతంలో భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రజలు భయాందోళనకు గురయ్యారు.ప్రకంపనలు బలంగా ఉన్నాయని, అయితే ఎటువంటి నష్టం జరగలేదని వారు చెప్పారు.
భూకంపం మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది అని కెనడా నేచురల్ రిసోర్సెస్ తెలిపింది.
భూ ప్రకంపనలు ఒకసారి కాదు, రెండు సార్లు సంభవించాయని,అందులో ఒకటి బలంగా, తీవ్రత 6, మరొకటి స్వల్పంగా, తీవ్రత 4.5గా నమోదైందని పేర్కొన్నారు.
వివరాలు
బ్రిటీష్ కొలంబియా ఎక్కడ ఉంది?
బ్రిటీష్ కొలంబియా కెనడా తీర ప్రాంతంలో ఉంది. 2024 సంవత్సరం నాటికి ఈ ప్రాంత జనాభా సుమారుగా 5.6 మిలియన్లు,ఇది కెనడాలో మూడవ అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం.
బ్రిటీష్ కొలంబియా రాజధాని విక్టోరియా, అతిపెద్ద నగరం వాంకోవర్.ఈ భూకంపం గతంలో వచ్చిన ఇతర భూకంపాలతో పోలిస్తే ఎక్కువ బలంగా ఉందని,ఇది స్థానికులు ఇప్పటివరకు అనుభవించిన బలమైన భూకంపమని చెప్పారు.