Dam Collapsc: సూడాన్‌లో కూప్పకూలిన డ్యామ్.. 100 మంది గల్లంతు
భారీ వర్షాల కారణంగా సూడాన్‌లో ఓ డ్యామ్ కుప్పకూలింది. ఈ ఘటనతో గ్రామాల్లోకి భారీగా వరదనీరు వచ్చింది. భారీ వరద నీరు ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారని స్థానిక మీడియా స్పష్టం చేసింది. ఆచూకీ లభించని వారితో పాటు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సూడాన్‌లోని రెడ్ సీ స్టేట్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి అర్బాత్ డ్యామ్ కూలిపోయింది.
60 మంది మరణించి ఉంటారని అంచనా
సూమారు 60 మంది వరకు మరణించి ఉంటారని సుడాన్ వార్త ఛానల్ వెల్లడించింది. ఇంకొక వార్త సంస్థ మాత్రం 100 మంది ఆచూకీ లభించలేదని తెలిపింది. రెడ్ సీ స్టేట్ నీటిపారుదల శాఖ అధికారి స్పందిస్తూ నష్టం తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారు. మొబైల్ నెట్ వర్క్ పనిచేయడంతో సమాచార సేకరణకు ఇబ్బందిగా మారిందని స్థానిక మీడియా పేర్కొంది.