Diamond Ring: హోటల్‌లో రూ.6.7 కోట్ల విలువైన డైమండ్ రింగ్ మిస్సింగ్.. దొంగ ఎవరంటే?
ఫారిస్‌లోని ఫస్ట్ అరోండిస్‌మెంట్‌లోని ప్రసిద్ధ హోటల్ రిట్జ్‌లో డైమంగ్ రింగ్ ఆదృశ్యం కలకలం రేపింది. 75 వేల యూరోలు అంటే సూమారు 6.7 కోట్ల విలువైన డైమండ్ రింగ్ చోరికి గురైనట్లు మలేషియాకు చెందిన ఓ పర్యాటకుడు ఫిర్యాదు చేశారు. హోటల్ బస చేస్తున్న పర్యాటకులు శుక్రవారం ఉదయం హోటల్ నుండి బయలుదేరి, తన గదిలోని టేబుల్ పై 6.51 క్యారెట్ డైమండ్ రింగ్ ఉంగరాన్ని వదిలేసి వెళ్లింది. అయితే ఉదయం 11.30 గంటలకు తిరిగి వచ్చేసరికి అక్కడ ఉంగరం మాయమైంది. దీంతో ఆ పర్యాటకురాలు గుండె ఝల్లుమంది. తర్వాత ఉంగరం దొరకడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
డైమండ్ రింగ్ ను గుర్తించిన భద్రతా సిబ్బంది
ఉంగరం కనిపించకుండా పోవడంతో పర్యాటకురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇక హోటల్ లోని నివాస ప్రాంగణంలో జరిగిన చోరీపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. రిట్జ్ హోటల్ భద్రతా సిబ్బంది కూడా ఉంగరాన్ని గుర్తించేందుకు ప్రయత్నించారు. క్లీనింగ్ సమయంలో హౌస్ కీపర్ హోటల్ గదిని శుభ్రం చేస్తున్నప్పుడు.. ఈ డైమండ్ రింగ్ వ్యాక్యూమ్ క్లీనర్‌లోకి వెళ్లి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో తన ఖరీదైన డైమండ్ రింగ్ దొరకడంతో ఆ పర్యాటకురాలు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బాధితురాలు హోటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.