Page Loader
Pakistan: పాకిస్తాన్‌లో రైలు బయలుదేరే సమయంలో భారీ పేలుడు.. 15 మందికి పైగా మృతి
పాకిస్తాన్‌లో రైలు బయలుదేరే సమయంలో భారీ పేలుడు.. 15 మందికి పైగా మృతి

Pakistan: పాకిస్తాన్‌లో రైలు బయలుదేరే సమయంలో భారీ పేలుడు.. 15 మందికి పైగా మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. పేలుడు సమయంలో రైల్వే స్టేషన్‌లో ఒక రైలు పెషావర్‌కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు స్థానిక మీడియా స్పష్టం చేసింది. ఈ ప్రమాద జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి. క్వెట్టా రైల్వే స్టేషన్‌లో పేలుడు సంభవించిన సమయంలో, పెషావర్‌కు ఓ రైలు బయలుదేరే సమయంలో అది జరిగిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్, ముహమ్మద్ బలోచ్ తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రైల్వే స్టేషన్ లో భారీ పేలుడు