Hydropower Dam: చైనాలో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు.. భారత్ సరిహద్దు వద్ద 'వాటర్ బాంబ్' హెచ్చరిక
ప్రపంచంలోనే అత్యంత పెద్ద జలవిద్యుత్ డ్యామ్ నిర్మాణానికి చైనా ఆమోదం తెలిపింది. టిబెట్ ప్రాంతంలోని యార్లంగ్ జంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయం నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్‌గా అంచనా వేసింది. 2020లో చైనాకు చెందిన పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఈ అంచనా తెలిపింది. ప్రస్తుతం చైనాలోనే అతి పెద్ద డ్యామ్ అయిన త్రీగోర్జెస్ డ్యామ్ సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్ మాత్రమే, అంటే కొత్త ప్రాజెక్టు సామర్థ్యం దానికి మూడురెట్లు ఎక్కువ. బ్రహ్మపుత్ర నది, టిబెట్‌లో యార్లంగ్ జంగ్బోగా పిలుస్తారు. భారత్ ద్వారా బంగ్లాదేశ్‌కు ప్రవహిస్తుంది.
ఈశాన్య రాష్ట్రాలకు వరద ముప్పు
ఇది ఇండియా ఈశాన్య రాష్ట్రాలకు వరదలను కలిగిస్తుంది. ఈ నది జలాల గురించి భారత్-చైనా మధ్య ఒప్పందం ఉన్నా, చైనా ఇటీవల వరదల సమయంలో ఈ సమాచారాన్ని సరైన రీతిలో పంచుకోవడం లేదు. 2002లో మొదటిసారి ఈ ఒప్పందం జరిగింది. తరువాత 2008, 2013, 2018లో కొన్ని మార్పులు చేసినా 2023లో చివరిసారిగా ఒప్పందం ముగిసింది. ఈ ఒప్పందం లేకుండా, చైనాలో ఈ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించటం భారత్‌కు సంక్షోభాన్ని కలిగించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తి అయితే, చైనాకు ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నదీ జలాలను మళ్లించేందుకు అవకాశం ఉంటుంది, దీంతో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు నీటి క్షేమం ఎదుర్కొంటాయి.
దిగువ ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం
అలాగే వర్షాకాలంలో భారీ వరద వస్తే, చైనా జలాశయాల ద్వారా పెద్దమొత్తంలో నీటిని విడుదల చేయడం వల్ల దిగువన ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవవచ్చు. ప్రాజెక్టు భారత్-చైనా సరిహద్దుకు కేవలం 30 కిమీ దూరంలో ఉంటుందని, ఇది భద్రతా పరంగా కూడా భారత్‌కు ఇబ్బందులు కలిగించవచ్చు. ఒకవేళ యుద్ధ పరిస్థితి ఏర్పడితే, చైనా ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని 'వాటర్ బాంబ్'గా ఉపయోగించి దాడి చేయడానికి వీలు ఉంటుంది.